News February 28, 2025
దిలావర్పూర్: ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని జాలరి మృతి

ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని ఓ జాలరి మృతి చెందిన ఘటన దిలావర్పూర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ వివరాల మేరకు… కాండ్లి గ్రామానికి చెందిన భోజన్న (59) శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వలలు చిక్కుకొని మృతి చెందాడని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
Similar News
News January 17, 2026
తల్లి దగ్గరకు వెళ్లగానే పిల్లలు ఏడుపు మానేసేది ఇందుకే!

నవజాత శిశువులకు వాసనను గుర్తించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా తల్లి పాలలో ఉండే ప్రత్యేకమైన సువాసనను వారు ఇట్టే పసిగట్టగలరు. అందుకే ఆకలి వేసినప్పుడు శిశువు తన తలని తల్లి వైపు తిప్పుతుంటారని ఇందులో తెలిసింది. అలాగే శిశువులు వారి తల్లి డ్రెస్ వాసనను బట్టి ఏడుపు ఆపివేస్తారని మరో పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని మీరెప్పుడైనా గమనించారా? COMMENT
News January 17, 2026
ICMR-NIIRNCDలో ఉద్యోగాలు

<
News January 17, 2026
మిరుదొడ్డి: మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మిరుదొడ్డి తెలంగాణ మోడల్ స్కూల్లో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో అడ్మిషన్లు జరగనున్నాయని ప్రిన్సిపల్ డాక్టర్ ప్రియదర్శిని అన్నారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వారు తెలిపారు. ఓసీ రూ.200, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 ఆన్లైన్ ఫీజ్ చెల్లించి https://tgms.telangana.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని అన్నారు.


