News February 28, 2025
ఏడుపాయలలో బోనంతో జోగు శ్యామల సందడి

ఏడుపాయల మహా జాతరలో భాగంగా గురువారం రాత్రి జోగు శ్యామల బోనంతో సందడి చేశారు. శ్యామల నెత్తిపై బోనం, చేతిలో త్రిశూలం చర్నాకోలతో ముందుకు సాగుతుండగా యువకులు, మహిళలు, భక్తులు కేరింతలతో హోరెత్తించారు. అనంతరం శ్యామల బోనం వన దుర్గామాత అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఆవిష్కృతమైంది. జాతరలో ఎడ్ల బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Similar News
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్‌పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 4, 2025
చిన్నశంకరంపేట: ‘బాల్య వివాహాలు చట్ట విరుద్ధం’

చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో విలేజ్ లెవల్ ఛైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కార్యదర్శి పద్మ, విజన్ ఎన్జీఓ ఆర్గనైజర్ యాదగిరి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. 18 ఏళ్లలోపు బాలిక, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చట్ట విరుద్దమన్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులంతా కలిసి బాల్య వివాహాలు చేయమని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు.
News November 4, 2025
కౌడిపల్లి: ‘విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి’

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు స్పష్టం చేశారు. కౌడిపల్లి ఆశ్రమ పాఠశాల తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలన్నారు. విద్యార్థులకు మాసహారం, చికెన్ పెట్టడం లేదని చెప్పారని, ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా నాణ్యమైన బోజనానికి కట్టుబడి ఉందన్నారు.


