News February 28, 2025

NGKL: ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. గురువారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. పరీక్షలలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,477, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,977 మంది హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

Similar News

News November 12, 2025

HYD: DEC 3 నుంచి టీజీ‌సెట్ హాల్ టికెట్లు

image

రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్)- 2025 పరీక్ష హాల్ టికెట్లను వచ్చే నెల 3వ తేదీ నుంచి తమ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 29 సబ్జెక్టుల పరీక్షలను వచ్చే నెల 10వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.

News November 12, 2025

నిర్మల్: మహిళపై లైంగిక దాడి.. ఇద్దరికి 20 ఏళ్ల శిక్ష

image

స్నేహితుడి భార్యను అపహరించి లైంగిక దాడి చేసిన ఇద్దరు నేరస్థులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ నిర్మల్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీవాణి బుధవారం తీర్పు వెలువరించారు. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్‌కు చెందిన ధర్మపురి, గంగాధర్ 2017లో ఈ నేరానికి పాల్పడ్డారు. ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేయగా విచారణలో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైంది.

News November 12, 2025

MBNR: భరోసా ఏడాది పూర్తి.. మొత్తం 163 కేసులు

image

మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రం స్థాపించబడి నేటికీ ఏడాది పూర్తి అయింది. మొత్తం 163 కేసులు భరోసా కేంద్రానికి అందాయి. CWC వారి భాగస్వామ్యంతో సహకారంతో POCSO కేసులు-117, రేప్ కేసులు-24, ఇతర కేసులు-22 వచ్చాయని, కౌన్సెలింగ్-218, పరిహారాలు-119 అందయన్నారు. DWO సహకారంతో ఇప్పటివరకు మొత్తం 45 బాధితులకు రూ.11,25,000 విలువైన పరిహారం అందించామని అధికారులు వెల్లడించారు.