News March 22, 2024

KCR నియోజకవర్గంలో కాంగ్రెస్ పాగా..!

image

KCR ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌ మున్సిపల్‌ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్‌ చేజిక్కించుకుంది. నూతన ఛైర్ పర్సన్‌గా మామిండ్ల జ్యోతికృష్ణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, తూప్రాన్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఛైర్మన్ ఎన్నిక గురువారం నిర్వహించారు. గత ఛైర్మన్‌(BRS)పై అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. ఇందులో గజ్వేల్‌ మాజీ MLA నర్సారెడ్డి కీలకంగా వ్యవహరించారు.

Similar News

News November 10, 2025

మెదక్: స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎంపీ

image

స్టాండింగ్ కమిటీ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయంలో జరిగిన సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం తదితర కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా రఘునందన్ రావు ఉన్నారు.

News November 10, 2025

మెదక్: ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. మొత్తం 11 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై వెంటనే స్పందిస్తూ సంబందిత అధికారులతో మాట్లాడారు.

News November 10, 2025

మెదక్: ‘జీవో నంబర్ 34 అమలు చేయాలి’

image

వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని జీవో నంబర్ 34లో అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. వికలాంగుల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం జీవో తీసుకువచ్చిన నేటికీ అది అమలు కావడం లేదని, వెంటనే 34 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు.