News February 28, 2025
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

AP: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Similar News
News January 18, 2026
ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్ బి, ఇ, సి విటమిన్లు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. బియ్యం కడిగిన నీళ్లను తలకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
News January 18, 2026
Friendflationతో ఒంటరవుతున్న యువత!

ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు ఫ్రెండ్‌ఫ్లేషన్‌గా మారి యువతను ఒంటరి చేస్తోంది. పెరిగిన హోటల్ బిల్లులు, సినిమా టికెట్లు, పెట్రోల్ ఖర్చుల భయంతో మెట్రో నగరాల్లోని యువత బయటకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఖర్చు భరించలేక చాలామంది ఇన్విటేషన్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. పార్కులు, ఇంటి దగ్గర చిన్నపాటి మీటింగ్స్ వంటి లో-కాస్ట్ ప్లాన్స్‌తో స్నేహాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 18, 2026
జోరందుకున్న మద్యం అమ్మకాలు

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ రూ.85 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లు లెక్కలు వెల్లడించాయి. ఈ వారం వ్యవధిలో రూ.877 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు చెప్పాయి. పండుగ 3 రోజుల్లో రూ.438 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలిపాయి.


