News March 22, 2024
25న భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

TG: భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం పనులకు మార్చి 25న శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి, పసుపు కొమ్ములు దంచుతారు. అలాగే తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది 200 క్వింటాళ్ల మేర తలంబ్రాలు కలిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా.. నవమి రోజున వీటిని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
Similar News
News February 4, 2026
గుడ్ న్యూస్: గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

TG: రాష్ట్రంలోని గృహాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్లను ఉచితంగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చేసిన సిఫార్సును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇళ్లకు కనెక్షన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు అయ్యే ఖర్చును వినియోగదారుడి నుంచి వసూలు చేసేవారు. ఇప్పుడిది ఉచితంగా అందుతుంది. ఈ సౌకర్యం పారిశ్రామిక రంగానికి వర్తించదు.
News February 4, 2026
FLASH: తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. ఇవాళ <<19045966>>ఉదయం<<>> భారీగా పెరిగిన గోల్డ్ రేటు సాయంకాలానికి కాస్త తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,090 తగ్గి రూ.1,59,440కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 పతనమై రూ.1,46,150 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.3,20,000గా ఉంది.
News February 4, 2026
అదానీ డేటా సెంటర్‌కు భూ కేటాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

AP: విశాఖ జిల్లాలో 480 ఎకరాలను డేటా సెంటర్ కోసం అదానీ గ్రూప్ కంపెనీలకు ఉచితంగా కేటాయించడంపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ ధీరజ్ సింగ్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం ఆదేశించింది. పాలసీ ప్రకారం ఉచితంగా భూమి ఇచ్చే అధికారం GOVTకు లేదని న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. సేల్‌డీడ్ రాస్తే ప్రాజెక్టు పూర్తికాకున్నా వెనక్కి తీసుకొనే అధికారం ఉండదని తెలిపారు.


