News February 28, 2025
రెండు కార్పొరేట్ పాఠశాలలకు నోటీసులు

నర్సీపట్నంలో రెండు వివిధ కార్పొరేట్ పాఠశాలలకు ఎంఈవో తలుపులు నోటీసులు జారీ చేశారు. బుధవారం శివరాత్రి, గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఉల్లంఘించి పాఠశాలలు తెరిచిన విషయం ఎంఈవో దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన నోటీసులు జారీ చేశారు. విషయం డీఈవో దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Similar News
News July 4, 2025
ఏలూరు: బంగారు ఆభరణాలు తస్కరిస్తున్న నలుగురి అరెస్ట్

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలు తస్కరిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కైకలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60 గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ శుక్రవారం తెలిపారు. కేసును ఛేదించిన సీఐ రవికుమార్, ఎస్ఐ, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు.
News July 4, 2025
GWL: ‘కేంద్రం మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలి’

గ్రామాలు పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్‌లో అచీవర్స్‌గా నిలవాలనే లక్ష్యంతో కేంద్రం మార్గదర్శకాలు గ్రామాల్లో అమలయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోశ్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులకు అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో శాఖల వారీగా సమాచారాన్ని సేకరించి పంచాయతీ సెక్రటరీ లాగిన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి శాఖ నుంచి సమాచారం తీసుకోవాలన్నారు.
News July 4, 2025
సిద్ధార్థ్ ‘3 BHK’ మూవీ రివ్యూ&రేటింగ్

తన తండ్రి సొంతిల్లు నిర్మించాలనే కలను హీరో నెరవేర్చాడా లేదా అన్నదానిపై ‘3 BHK’ మూవీని తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. సిద్ధార్థ్, శరత్ కుమార్ పర్ఫార్మెన్స్ మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ ఫరవాలేదనిపించాయి. డైరెక్టర్ శ్రీ గణేశ్ స్క్రీన్ ప్లే స్లోగా సాగింది. సాంగ్స్ అలరించలేదు. కథను ముందే ఊహించవచ్చు. కొన్ని సీన్లు పదేపదే వస్తూ సీరియల్‌ను తలపిస్తాయి. రేటింగ్: 2.25/5