News February 28, 2025
మంచిర్యాల: చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు

చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు శిక్షతో పాటు తీసుకున్న మొత్తం నష్టపరిహారం ఇవ్వాలని రెండో అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి కే.నిరోషా తీర్పునిచ్చారు. సీసీసీ నన్పూర్‌కు చెందిన వంటల సత్యనారాయణ రెడ్డి వద్ద మేకల సత్యనారాయణ రెడ్డి 2017లో రూ.8 లక్షలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో చెక్ బౌన్స్ అయింది. బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, నేరం రుజువుకావడంతో శిక్ష విధించారు.
Similar News
News September 18, 2025
సంచలన చిత్రం మిరాయ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండి కుర్రాడే

హనుమాన్, మిరాయ్ చిత్రాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ఉండి గ్రామానికి చెందినవారు. గ్రామ కరణం తాడికొండ లక్ష్మీ నరసింహం మనవడైన గౌర హరి, తన సంగీత ప్రతిభతో తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారని స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు. 8చిత్రాలకు పైగా సంగీతం అందించగా, వీటిలో హనుమాన్, మిరాయ్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. గౌర హరిది ఉండివాడు కావడం గర్వంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్‌లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్‌కేర్‌లో ఉద్యోగాలు

<