News February 28, 2025
SLBC TUNNEL: సర్కార్ కీలక నిర్ణయం

TG: SLBC టన్నెల్ కూలిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగం ఇన్‌లెట్ (దోమలపెంట) నుంచి 14వ కి.మీ వద్ద యాడిట్ (టన్నెల్ నుంచి బయటకు వెళ్లే దారి) పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ బాధ్యతను NRSCకి అప్పగించింది. టన్నెల్‌లో చిక్కుకున్నవారు కచ్చితంగా ఎక్కడ ఉన్నారనే విషయం తెలియగానే ఈ ప్రక్రియ మొదలుపెడతారు.
Similar News
News February 28, 2025
జగన్ కుట్రలతో జాగ్రత్త: సీఎం చంద్రబాబు

AP: YS జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలను CM చంద్రబాబు హెచ్చరించారు. గతంలో వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం TDPపైన వేశారని వివరించారు. అప్పుడు అప్రమత్తంగా లేకపోవడంతో ఎన్నికల్లో నష్టపోయామని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ కుట్రలను పసిగట్టలేకపోయిందని పేర్కొన్నారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర ఉందని, పోలీసులు CC ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదని చెప్పారు.
News February 28, 2025
మెరుగుపడిన Q3 GDP.. 6.2%గా నమోదు

FY2024-25 మూడో త్రైమాసికంలో భారత ఎకానమీ 6.2% వృద్ధిరేటు నమోదు చేసింది. రెండో త్రైమాసికంలోని 5.6%తో పోలిస్తే కొంత మెరుగైంది. గ్రామీణ ఆదాయం పెరగడం, ఖరీఫ్ దిగుబడులు మెరుగ్గా ఉండటం ఇందుకు దోహదపడింది. గత ఏడాది క్యూ3 వృద్ధిరేటైన 9.5%తో పోలిస్తే మాత్రం బాగా తక్కువే. తయారీ, మైనింగ్ రంగాల ప్రదర్శన మెరుగ్గా లేకపోవడమే ఇందుకు కారణం. మొత్తంగా ఈ ఆర్థిక ఏడాదిలో GDP 6.5%గా ఉంటుందని NSO అంచనా వేసింది.
News February 28, 2025
ఏఐ ఎఫెక్ట్.. 1350 మంది ఉద్యోగుల తొలగింపు

సాంకేతికంగా అద్భుతాలు సృష్టిస్తున్న’AI’ ఉద్యోగులకు శాపంగా మారుతోంది. అమెరికాలో ఆటోడెస్క్ అనే సాప్ట్‌వేర్ కంపెనీ 1350మందిని తొలగించింది. దీని ద్వారా మిగిలిన డబ్బును ‘ఏఐ’ టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే 41శాతం కంపెనీలు ‘ఏఐ’తో ఉద్యోగులను తగ్గించుకుంటామని ప్రకటించాయి. జాబ్‌స్కిల్స్ రిక్వైర్‌మెంట్ తరచుగా మారుతుండటంతో కొత్తవి నేర్చుకోవటం ఎంప్లాయ్స్‌కి ఇబ్బందిగా మారుతోంది.