News February 28, 2025
గద్వాల: అమ్మాయి దక్కదని ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి దక్కదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. రాజోళికి చెందిన నరేశ్ (20) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఏమైందో ఏమోకాని తనకు ఆ అమ్మాయి దక్కదని భావించి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 28, 2025
ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 52% ఓట్లు: పురందీశ్వరి

AP: రాజకీయాల్లో మచ్చలేని పార్టీ బీజేపీ అని ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి తెలిపారు. గతంలో స్కాముల ప్రభుత్వాలను చూస్తే ఇప్పుడు ప్రధాని మోదీ నేతృత్వంలో స్కీముల సర్కారును చూస్తున్నామన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 52 శాతం సీట్లు వస్తాయని ఓ సర్వేలో తేలిందని చెప్పారు. ఇవాళ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహితంగా ఉందని కొనియాడారు.
News February 28, 2025
గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

భద్రాచలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఓ యువకుడు మృతి చెందాడు. గల్లంతైన మరో యువకుడి కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 28, 2025
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్: గొట్టిపాటి

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బడ్జెట్ దోహదపడుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ రూ.3.22 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. తాను మంత్రిగా ఉన్న ఇంధన శాఖకు రూ.13,600 కోట్ల బడ్జెట్ కేటాయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.