News February 28, 2025
నెల్లూరు: నాడు ప్రేమ పెళ్లి సంచలనం.. నేడు విషాదం

రెండేళ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా సంచలన రేపిన ప్రేమ వివాహం నేడు విషాదంతో ముగిసింది. పొదలకూరు(M), మర్రిపల్లికి చెందిన శివప్రియ అనే అమ్మాయిని నెల్లూరు రూరల్‌కి చెందిన నాగ సాయి అనే యువకుడు రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో ఆ వివాహం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో శివప్రియ ఆత్మహత్య చేసుకుంది. భర్త నాగసాయి పోలీసులకు తెలియజేశారు.
Similar News
News February 28, 2025
నెల్లూరుకు ప్రముఖ సింగర్స్ రాక

కొడవలూరు మండలం గండవరం గ్రామంలో శ్రీ ఉదయ కాళేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి గొప్ప సంగీతవిభావరిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ సునీత, సమీర భర్వదాజ్, హారికానారాయణ్ లతో జబర్దస్త్ టీం పాల్గొని సందడి చేయనుంది.
News February 28, 2025
నెల్లూరు: పదో తరగతి విద్యార్థులు బస్సుల్లో ప్రయాణం FREE

పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లవచ్చని DEO బాలాజీ రావు తెలిపారు. మనుబోలు మండల కేంద్రంలోని MEO కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 33,400 మంది విద్యార్థులు మార్చి 15 నుంచి పరీక్షలు రాస్తారన్నారు. వారు ఉచితంగా పరీక్షా కేంద్రానికి బస్సుల్లో వెళ్లవచ్చన్నారు. జిల్లాలో పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
News February 28, 2025
నెల్లూరుకి కేంద్రం బాధ్యతను అప్పగించింది : వీసీ

వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025ను జిల్లా స్థాయిలో నిర్వహించడానికి వీఎస్‌యూ, ఎన్ఎస్‌ఎస్, నెల్లూరు నెహ్రూ యువ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతను అప్పగించిందని వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ 2025 కు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వీసీ సూచించారు.