News February 28, 2025

నేడు రాయలసీమకు వర్షసూచన

image

AP: రాష్ట్రంలో నేడు భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయి. తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఎండ తీవ్రత వల్ల వాతావరణంలో అనిశ్చితి ఏర్పడి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ఆస్కారం ఉంది. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. వర్షాల కారణంగా రాయలసీమలో ఉక్కపోత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని చెప్పింది. మిగతా ప్రాంతాల్లో 2-3డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది.

Similar News

News February 28, 2025

ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్: శ్రీధర్‌బాబు

image

తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్కులను మహిళల కోసం ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు 10శాతం ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఫిక్కీలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రైజెస్ సదస్సులో వెల్లడించారు.

News February 28, 2025

జగన్ కుట్రలతో జాగ్రత్త: సీఎం చంద్రబాబు

image

AP: YS జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలను CM చంద్రబాబు హెచ్చరించారు. గతంలో వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం TDPపైన వేశారని వివరించారు. అప్పుడు అప్రమత్తంగా లేకపోవడంతో ఎన్నికల్లో నష్టపోయామని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ కుట్రలను పసిగట్టలేకపోయిందని పేర్కొన్నారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర ఉందని, పోలీసులు CC ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదని చెప్పారు.

News February 28, 2025

మెరుగుపడిన Q3 GDP.. 6.2%గా నమోదు

image

FY2024-25 మూడో త్రైమాసికంలో భారత ఎకానమీ 6.2% వృద్ధిరేటు నమోదు చేసింది. రెండో త్రైమాసికంలోని 5.6%తో పోలిస్తే కొంత మెరుగైంది. గ్రామీణ ఆదాయం పెరగడం, ఖరీఫ్ దిగుబడులు మెరుగ్గా ఉండటం ఇందుకు దోహదపడింది. గత ఏడాది క్యూ3 వృద్ధిరేటైన 9.5%తో పోలిస్తే మాత్రం బాగా తక్కువే. తయారీ, మైనింగ్ రంగాల ప్రదర్శన మెరుగ్గా లేకపోవడమే ఇందుకు కారణం. మొత్తంగా ఈ ఆర్థిక ఏడాదిలో GDP 6.5%గా ఉంటుందని NSO అంచనా వేసింది.

error: Content is protected !!