News February 28, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93.57% పోలింగ్

ఉమ్మడి WGL-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న నల్గొండలో లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సా. 4 గం. వరకు 93.57% పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా.. హనుమకొండ 91.66, వరంగల్ 94.13, జనగామ 94.31, మహబూబాబాద్ 94.47, భూపాలపల్లి 93.62, ములుగులో 92.83% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మీరు ఓటు వేశారా? కామెంట్ చేయండి.
Similar News
News January 10, 2026
NRPT: జాతీయస్థాయి సైక్లింగ్‌కు అంబిక

కృష్ణ మండలం ముడుమాల్ గ్రామానికి చెందిన అంబిక జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించి ఆర్థిక సాయం అందజేశారు. అంబిక అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సర్పంచ్, వార్డు సభ్యులు ఆకాంక్షించారు. విద్యార్థులందరినీ ఇదే రీతిలో ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
News January 10, 2026
తిరుపతి: ప్రతి పాఠశాలకు ప్రత్యేకాధికారి..!

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేకాధికారిని నియమించింది. విద్యార్థుల బోధన, చదవడం, పరీక్షలు, పది విద్యార్థుల స్టడీ అవర్స్.. 100 శాతం ఉత్తీర్ణత కోసం వీరి పర్యవేక్షణ ఉంటుంది. పిలల్ల సామర్ధ్యాలపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థులు 13,675 మంది, మున్సిపాలిటి పాఠశాలల్లో 972 మంది చదువుతున్నారు.
News January 10, 2026
సెక్యూరిటీని పక్కనపెట్టి.. జనంలోకి పవన్ కళ్యాణ్

పిఠాపురం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాన్యుడిలా ప్రజలతో మమేకమయ్యారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి పర్యటనలో సిబ్బందిని పక్కనపెట్టి కళాకారులు, స్థానికులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పరిమిత సంఖ్యలో భద్రతను ఉంచుకుని నేరుగా ప్రజల వద్దకు వెళ్లడం చర్చనీయాంశమైంది. జనంతో కలిసి పవన్ సందడి చేయడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


