News February 28, 2025
ఖమ్మం: బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపులు వెలవెల!

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 100, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.
Similar News
News September 15, 2025
కేంద్రానికి రూ.100 చెల్లిస్తే మనకి ఎంత తిరిగి వస్తుందంటే?

రాష్ట్రాలు పన్ను రూపంలో కేంద్రానికి చెల్లించే ప్రతి రూ.100లో తిరిగి ఎంత పొందుతాయో తెలుసా? అత్యల్పంగా మహారాష్ట్ర రూ.100 పన్నులో ₹6.8 మాత్రమే తిరిగి పొందుతోంది. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ ₹4278.8 తీసుకుంటుంది. ఆర్థిక సంఘం సూత్రాల ఆధారంగా జనాభా, ఆదాయ అసమానత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పంపిణీ చేస్తారు. TGకి ₹43.9, APకి ₹40.5 వస్తాయి. వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడటమే దీని ఉద్దేశ్యం.
News September 15, 2025
ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకున్న కడెం ప్రాజెక్టు

నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కడెం ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యానికి నిదర్శనం. 1949లో నిర్మాణం ప్రారంభమైన ఈ ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉన్నాయి. 1995, 2022, 2023వ సంవత్సరాల్లో ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వచ్చినప్పటికీ పటిష్టంగా నిలబడింది. ఇది నాటి ఇంజినీర్ల పనితీరు, దూరదృష్టికి నిలువుటద్దంలా కనిపిస్తోంది.
News September 15, 2025
జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య

జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట శివారులో ఆదివారం రాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన యువకుడు నహీముద్దీన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.