News February 28, 2025
కరీంనగర్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి KNR, MDK, NZB, ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News December 29, 2025
మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజా పూర్తిగా నిషేధం: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించినట్లు ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాపై నిషేధం విధించిన నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాలిపటాలు ఎగిరేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

NZB: 21 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 21 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని CP చెప్పారు.