News February 28, 2025
అనకాపల్లి: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి రూ.107.46 కోట్లు

అనకాపల్లి జిల్లాలో మార్చి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.107.46 కోట్లు విడుదల చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశీదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,56,272 మంది లబ్ధిదారులకు శనివారం పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి పెన్షన్ సొమ్ము డ్రా చేస్తారన్నారు.
Similar News
News February 28, 2025
సిరిసిల్ల: స్కానింగ్ సెంటర్లు నియమ నిబంధనలు పాటించాలి: రజిత

సిరిసిల్ల జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు నియమ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో పీసీపీఎస్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వైద్యులు లక్ష్మీనారాయణ, అంజలి, శోభారాణి, భాస్కర్ పాల్గొన్నారు.
News February 28, 2025
జగన్ కుట్రలతో జాగ్రత్త: సీఎం చంద్రబాబు

AP: YS జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలను CM చంద్రబాబు హెచ్చరించారు. గతంలో వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం TDPపైన వేశారని వివరించారు. అప్పుడు అప్రమత్తంగా లేకపోవడంతో ఎన్నికల్లో నష్టపోయామని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ కుట్రలను పసిగట్టలేకపోయిందని పేర్కొన్నారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర ఉందని, పోలీసులు CC ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదని చెప్పారు.
News February 28, 2025
బడ్జెట్లో సూపర్-6 పథకాలకు చిల్లు: అనంత

అసెంబ్లీలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్తో సూపర్-6 పథకాలకు చిల్లు పెడుతున్నారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ను అంకెల గారడిగా అభివర్ణించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానం బహిర్గతం అయ్యిందన్నారు.