News February 28, 2025
బాపట్ల: మైనర్ బాలికపై అత్యాచారం

బాపట్ల జిల్లా నగరం మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరం ఎస్ఐ బండ్ల భార్గవ్ వివరాల ప్రకారం.. ఈనెల 25న ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా దగ్గరలో ఉన్న స్కూల్ బస్సులోకి లాక్కొని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News February 28, 2025
భద్రాచలం గోదావరిలో ఇద్దరు యువకులు మృతి

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్(18) గా పోలీసులు గుర్తించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 28, 2025
టెన్త్ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్

మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా చీఫ్ సూపరింటెండెంట్‌లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సి.ఎస్.లకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు.
News February 28, 2025
ATP: రూ.2.95కోట్ల విలువైన ఫోన్లు రికవరీ

అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా ఎస్పీ జగదీశ్ రూ.2.95కోట్ల విలువ చేసే 1,183 ఫోన్లను బాధితులకి అందజేశారు. సాంకేతికత వినియోగించి ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ 11,378 పోన్లు రికవరీ చేసిందని తెలిపారు. వాటి విలువ సుమారు రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు.