News February 28, 2025
KMR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 5 నుంచి షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ఇంటర్ మొదటి సంవత్సరం 8743, ద్వితీయ సంవత్సరం 9726 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.
Similar News
News February 28, 2025
కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడం: రేవంత్ రెడ్డి

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెదిరింపులకు భయపడమని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన వల్లే మెట్రో, మూసీ ప్రాజెక్టులు ఆగిపోయాయని పునరుద్ఘాటించారు. మోదీ ప్రభుత్వం ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు. అధికారం కోల్పోతారనే కులగణనకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ చెల్లించిన పన్నుల్లో పావలా కూడా రాష్ట్రానికి రావట్లేదన్నారు.
News February 28, 2025
APలో రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ముందా?: సీఎం రేవంత్ రెడ్డి

TG: BJP, NDA పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉప కులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారని CM రేవంత్ వెల్లడించారు. ‘APలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అక్కడ బీసీ మైనార్టీలకు ఇస్తున్న రిజర్వేషన్లు రద్దు చేసే దమ్ము కేంద్రానికి ఉందా కిషన్ రెడ్డి? భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా? APలో SC వర్గీకరణ ఎందుకు చేయడం లేదు? మాదిగలకు ద్రోహం చేయడం లేదా?’ అని CM ప్రశ్నించారు.
News February 28, 2025
పెన్షన్ల పంపిణీ కోసం రూ.112.06 కోట్లు: తిరుపతి కలెక్టర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను మార్చి 1న ఉదయం లబ్ధిదారుల ఇంటి వద్దనే సిబ్బంది పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,62,461 మంది పెన్షన్ దారులకు సుమారు 112.06 కోట్ల రూపాయలను పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉదయం 7గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు.