News February 28, 2025
ఆదిలాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి ADB, NZB, KNR, MDK పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News November 13, 2025
విద్యుత్తు అధికారులు నిర్లక్ష్యంగా ఉండరాదు: CMD

ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో APSPDCL సీఎండీ పుల్లారెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, స్మార్ట్ మీటర్ల గురించి చర్చించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని అధికారులకు సూచించారు. జిల్లాలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్లు అధికంగా ఏర్పాటు చేసేలా ప్రతి అధికారి ఓ లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నారు.
News November 13, 2025
ఇందిరమ్మ మహిళా డెయిరీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి: Dy.CM

ముదిగొండ మండలం గంధసిరిలోని ఇందిరమ్మ మహిళా డెయిరీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని సూచించారు. పశుగ్రాసం సరఫరా, షెడ్ల నిర్మాణం ఉపాధి హామీ ద్వారా పూర్తి చేయాలన్నారు. అలాగే, పాఠశాలలు, యంగ్ ఇండియా స్కూల్, మధిర ఆసుపత్రి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
News November 13, 2025
ములుగు: బీజాపూర్ ఎన్ కౌంటర్ మృతులు వీరే..!

బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల వివరాలను ఎస్పీ జితేంద్ర వెల్లడించారు. బుచ్చన్న, ఊర్మిళ, జగత్ తామో, దేవి, భగత్, మంగ్లీ ఓయం అనే ఆరుగురు మృతులను గుర్తించామన్నారు. వీరిపై రూ.27 లక్షల రివార్డు ఉందన్నారు. వీరి వద్ద 2 ఇన్సాస్ రైఫిళ్లు, 9 ఎంఎం కార్బన్, 303 రైఫిల్, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయన్నారు.


