News February 28, 2025

నిజామాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

image

ఉమ్మడి NZB, KNR, MDK, ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.

Similar News

News February 28, 2025

పెన్షన్ల పంపిణీ కోసం రూ.112.06 కోట్లు: తిరుపతి కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను మార్చి 1న ఉదయం లబ్ధిదారుల ఇంటి వద్దనే సిబ్బంది పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,62,461 మంది పెన్షన్ దారులకు సుమారు 112.06 కోట్ల రూపాయలను పంపిణీకి  సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉదయం 7గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. 

News February 28, 2025

సిరిసిల్ల: చికిత్స పొందుతూ గర్భిణీ మృతి

image

కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన సిద్రవేణి సోని అనే గర్భిణీ మృతిచెందింది. చికిత్స కోసం ఆమె హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సోని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 28, 2025

రేపు ఆదిలాబాద్‌కు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి.. 

image

ఆదిలాబాద్‌లో శనివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకా యారా పర్యటించనున్నారు. జిల్లా కోర్టులో డిస్పెన్సరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్‌‌కు చేరుకుంటారు. ఉ. 10.30 జిల్లా కోర్టుకు రానున్నారు. అనంతరం మరుసటి రోజు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

error: Content is protected !!