News March 22, 2024
నేడు అకౌంట్లోకి డబ్బులు

TG: రైతుబంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని వెల్లడించారు. అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ 23 ఎకరాలను తన పేరుపై అక్రమంగా మార్చుకున్నారని తెలిపారు. చాలామంది బీఆర్ఎస్ లీడర్లు వందల ఎకరాల భూమిని తమ పేరు మీదకు మార్చుకున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
19న మహిళలకు చీరల పంపిణీ

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని, వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా, ఇందిరా మహిళా శక్తి చీరకు రూ.480గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాగా భారీగా చీరల ఆర్డర్లతో చేనేత సంఘాలకు చేతి నిండా పనిదొరికినట్లయ్యింది.
News November 10, 2025
IVF ప్రక్రియలో దశలివే..

IVFలో 5 కీలకమైన దశలు ఉంటాయి. ఎగ్ స్టిమ్యులేషన్‌కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి బ్లడ్ టెస్ట్ చేయడానికి 9-14 రోజులు పడుతుంది. తర్వాత పిండాన్ని బదిలీ చేస్తారు. యావరేజ్‌గా IVF సైకిల్ కోసం 17-20 రోజుల సమయం పడుతుంది. అయితే పేషెంట్ కండీషన్ బట్టి.. సమయం మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా సంతానం పొందాలనుకునేవారు ప్రోటీన్లు, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.
News November 10, 2025
చక్కెర తినడం మానేస్తే..

చక్కెర తినడం మానేస్తే శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఆకలి తగ్గుతుంది. సాధారణంగా బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె, కాలేయం మరింత ఆరోగ్యవంతంగా మారుతాయి. చిరాకు, ఆందోళన తగ్గి ఫోకస్ పెరుగుతుంది. అయితే ఒక్కసారిగా మానేయకుండా క్రమంగా తగ్గించాలి’ అని సూచిస్తున్నారు.


