News February 28, 2025

ఆదిలాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

image

ఉమ్మడి ADB, NZB, KNR, MDK పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్‌లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.

Similar News

News November 3, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కాలినడకన వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. కాలినడకన వెళ్తున్న చేగుంటకు చెందిన కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.

News November 3, 2025

ఈ వరి రకం.. ముంపు ప్రాంత రైతులకు వరం

image

MTU 1232.. ఇది 15 నుంచి 20 రోజుల పాటు వరద ముంపును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వరి రకం. పంటకాలం 140 రోజులు. పైరు తక్కువ ఎత్తు పెరిగి, గింజ సన్నగా ఉంటుంది. బియ్యం శాతం అధికం. దోమ పోటు, అగ్గి తెగులు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది పడిపోదు, గింజ రాలదు. ఎకరాకు సాధారణ భూమిలో 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో 30-35 బస్తాల దిగుబడినిస్తుంది. ✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 3, 2025

SLBC టన్నెల్‌కు AEM సర్వే.. దేశంలోనే తొలిసారి

image

SLBC సొరంగం పనులను సురక్షితంగా పునఃప్రారంభించేందుకు ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ (AEM) సర్వేను CM రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ నేడు ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 2025లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో మిగిలిన 9.8 కి.మీ సొరంగ మార్గంలో భూగర్భ నీటి నిల్వలు, బలహీన శిలలు, ఫాల్ట్‌ జోన్‌లను గుర్తించేందుకు NGRI ఈ సర్వేను నిర్వహించనుంది. దేశంలో ఇటువంటి సాంకేతికతను ఇరిగేషన్ టన్నెల్‌కు ఉపయోగించడం ఇదే మొదటిసారి.