News February 28, 2025
గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించేలా..

AP: గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరిపై PIT-NDPS చట్టం కింద కేసు పెట్టి ఏడాది పాటు జైలు శిక్ష వేస్తోంది. తొలిసారిగా విజయవాడ పోలీసులు ఇద్దరిపై అభియోగాలు మోపారు. జిల్లాల వారీగా గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్ల జాబితా తయారు చేస్తున్నారు. ఇక నుంచి అరెస్ట్ అయ్యాక బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ మళ్లీ అవే నేరాలకు పాల్పడటం కుదరదని పోలీసులు వెల్లడించారు.
Similar News
News February 28, 2025
CT: వర్షంతో నిలిచిన మ్యాచ్

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన AFG 273 పరుగులు చేయగా, ఆసీస్ 12.5 ఓవర్లలో 109 పరుగులు చేసింది. మరోవైపు పవర్ ప్లేలో అత్యధిక పరుగులు(10 ఓవర్లలో 90) చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. ఇక AUS ప్లేయర్ హెడ్ ఆ జట్టు తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(34 బంతుల్లో 51) చేశారు. ఇరు జట్లు సెమీస్ చేరేందుకు ఈ మ్యాచ్ ఫలితం కీలకంగా ఉంది.
News February 28, 2025
రోజులో ఏ సమయంలో నీళ్లు తాగాలంటే?

ఉదయం పరగడుపునే 1 లీటర్ నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి తాగలేని వారు కాస్త గ్యాప్ ఇచ్చి తాగాలి. గోరు వెచ్చటి నీటిని తాగితే వ్యర్థాలు, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్తాయి. పేగులు శుభ్రంగా మారతాయి. అలాగే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత నీరు తాగాలి. ఇలా చేస్తే నీళ్లు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. వ్యాయామానికి ముందు గ్లాసు నీరు తీసుకోవాలి. నిద్ర పోయేముందు ఓ గ్లాసు నీరు తాగాలి.
News February 28, 2025
రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం: రేవంత్

TG: పదేళ్ల BRS పాలనలో వరంగల్‌కు ఏం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘వరంగల్‌కు ఎయిర్‌పోర్టు కావాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిని నేనే అడిగా. భూసేకరణను క్లియర్ చేసి ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు కావాలని ఢిల్లీలో నివేదికలు అందించాకే కదలిక వచ్చింది. ఢిల్లీకి ఇందుకే వెళ్తున్నాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నేనే సాధించా. రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తాం’ అని CM స్పష్టం చేశారు.