News February 28, 2025
VZM: పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు

విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 28, 2025
రోజులో ఏ సమయంలో నీళ్లు తాగాలంటే?

ఉదయం పరగడుపునే 1 లీటర్ నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి తాగలేని వారు కాస్త గ్యాప్ ఇచ్చి తాగాలి. గోరు వెచ్చటి నీటిని తాగితే వ్యర్థాలు, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్తాయి. పేగులు శుభ్రంగా మారతాయి. అలాగే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత నీరు తాగాలి. ఇలా చేస్తే నీళ్లు జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. వ్యాయామానికి ముందు గ్లాసు నీరు తీసుకోవాలి. నిద్ర పోయేముందు ఓ గ్లాసు నీరు తాగాలి.
News February 28, 2025
పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: శ్రీనివాస వర్మ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం రూ.3.2 లక్షల కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయించడంతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలకు నిధులు కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News February 28, 2025
మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు గాదె సత్యనారాయణ (76) ఊపిరితిత్తుల వ్యాధితో శుక్రవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలలో సేవలందించారు. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయా పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.