News February 28, 2025
SLBCలో సహాయ చర్యల కోసం వెళుతున్న సింగరేణి రెస్క్యూ

SLBCలో సహాయక చర్యలు చేపట్టేందుకు సింగరేణి సంస్థకు సంబంధించిన రెస్క్యూ సిబ్బందిని ఇప్పటికే వంద మందిని అత్యాధునిక సహాయ సామగ్రితో పంపించినట్లు C&MDబలరాం పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా మరొక 200 మంది రెస్క్యూ సిబ్బందిని అదనంగా పంపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ సిబ్బందిని C&MDఅభినందించారు. సొరంగం లో చిక్కుకున్న వారు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.
Similar News
News February 28, 2025
రెండు రోజుల్లో 24 మందిపై కేసు: VZM ఎస్పీ

విజయనగరం సిటీ పరిధిలోని రెండు రోజుల్లో 24 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో పట్టుబడిన నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా మెజిస్ట్రేట్ రూ.10 వేలు చొప్పున మొత్తం రూ. 2.40 లక్షల జరిమానా విధించారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 28, 2025
‘విశాఖను ప్రథమ స్థానంలో నిలపండి’

విశాఖలో 2024 స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రథమ స్థానంలో నిలపాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్ సోమనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జోన్ -3 ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నేరుగా ముఖాముఖిగా, స్వచ్ఛత యాప్, వెబ్సైట్ లింకు ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. విశాఖ నగర అభివృద్ధికి, నగరాన్ని దేశంలోనే ప్రథమ స్థానం లక్ష్యసాధనకు ప్రజలుకు అవగాహన కల్పించాలన్నారు.
News February 28, 2025
70 సైకిళ్లు సిద్ధం.. తీసుకెళ్లేందుకు మీరు సిద్ధమా!

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించిన వారికి 70 సైకిళ్లు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పదో తరగతి తుది ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి సైకిళ్లను పొందాలన్నారు. 192 ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదో తరగతి చదువుతున్న 6074 మంది విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవాలన్నారు.