News March 22, 2024

అనుమతులు తప్పనిసరి: ఏలూరు ఎస్పీ

image

ఎన్నికల కోడ్, సెక్షన్ 144 సీఆర్పీ అమలులో ఉన్నందున ఏవైనా ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు, సభలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ మేరీ ప్రశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సువిధ యాప్‌లో పూర్తి సమాచారంతో ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకే గ్రామంలో ఒకే సమయంలో ఏ రెండు పార్టీలకు సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతించమని తెలిపారు.

Similar News

News September 8, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ అన్నారు.

News September 7, 2025

రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తాం: కలెక్టర్

image

రైతులకు యూరియా కొరత లేకుండా అందిస్తున్నామని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. కాళ్ల మండలం కోపల్లె సొసైటీలో యూరియా వినియోగంపై జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. సొసైటీ గోడౌన్‌లోని ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. అధికారుల సూచనల మేరకు ఎరువులను వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆమె రైతులకు సూచించారు. సొసైటీ ఛైర్మన్ పాల్గొన్నారు.

News September 7, 2025

పెదతాడేపల్లి గురుకుల పాఠశాల పీజీటీ సస్పెండ్

image

తాడేపల్లిగూడెం (M) పెదతాడేపల్లి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పీజీటీ భీమడోలు రాజారావును జిల్లా కలెక్టర్ నాగరాణి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు చెందిన బ్యాగ్ పైపర్ బ్యాండ్ విద్యార్థుల బృందాన్ని నరసాపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలకు తీసుకెళ్లినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే, జిల్లా కోఆర్డినేటర్ ఉమా కుమారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.