News February 28, 2025
సంగారెడ్డిలో మహిళ హత్య..UPDATE

సదాశివపేటలో <<15595690>>మహిళ హత్య <<>>జిల్లాలో కలకలం రేపుతోంది. CI మహేశ్ గౌడ్ వివరాలిలా.. నందికందికి చెందిన చిన్నలక్ష్మి(39) అనంతసాగర్‌లో కుమార్తె శిరీష వద్దకు వెళ్లి 26న తిరిగి ఇంటికొచ్చింది. అదేరోజు రాత్రి పని ఉందని భర్తకు చెప్పి సదాశివపేటకు వచ్చింది. నిన్న ఉదయం MPDO ఆఫీసు సమీపంలో లక్ష్మి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 17, 2025
అన్నమయ్య జిల్లా కలెక్టర్ హెచ్చరికలు

అన్నమయ్య కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజలకు దీపావళి పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని శుక్రవారం సూచించారు. బాణాసంచా స్టాళ్ల భద్రత, ఫైర్ సేఫ్టీ, పార్కింగ్, పారిశుద్ధ్య చర్యలపై అన్ని శాఖల అధికారులను సమన్వయంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షాపులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా, ధరల పట్టికలు, సేఫ్టీ సూచనలు, స్టాళ్ల మధ్య సరిపడా దూరం పాటించాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 17, 2025
జగిత్యాల: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు

JGTL(D) వెల్గటూర్ మండలం కొత్తపల్లి వద్ద రాష్ట్ర రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్గటూర్ నుంచి రాయపట్నం వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కిందపడి, తలకు తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావమైంది. కొన ఊపిరితో ఉన్న బాధితుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 17, 2025
కొబ్బరి బొండాల సేకరణ మంచి ఆదాయం: కలెక్టర్

ఏలూరు జిల్లా ప్రజలకు రక్షిత మంచినీటిని 2 పూటల అందించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం మాట్లాడుతూ.. రైతుకు అవసరం అయ్యే అభివృద్ధి పనులుపై దృష్టి సారించాలని ఆదేశించారు. చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు సమర్దవంతంగా పనిచేయాలన్నారు. ప్లాస్టిక్ వస్తువులు, కొబ్బరి బొండాలు సేకరించాలని, అవి మంచి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. క్లాప్ మిత్రలకు ప్రజలు సహకరించాలన్నారు.