News February 28, 2025
సంగారెడ్డిలో మహిళ హత్య..UPDATE

సదాశివపేటలో <<15595690>>మహిళ హత్య <<>>జిల్లాలో కలకలం రేపుతోంది. CI మహేశ్ గౌడ్ వివరాలిలా.. నందికందికి చెందిన చిన్నలక్ష్మి(39) అనంతసాగర్లో కుమార్తె శిరీష వద్దకు వెళ్లి 26న తిరిగి ఇంటికొచ్చింది. అదేరోజు రాత్రి పని ఉందని భర్తకు చెప్పి సదాశివపేటకు వచ్చింది. నిన్న ఉదయం MPDO ఆఫీసు సమీపంలో లక్ష్మి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 28, 2025
వన దుర్గమ్మ ప్రత్యేక అలంకరణ

మెదక్ జిల్లాలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల దేవస్థానం. మహాశివరాత్రి పురస్కరించుకుని నేడు రథోత్సవం సందర్భంగా అమ్మవారిని వేకువజామున మంజీరా నీళ్లతో అభిషేకం చేసి వివిధ రకాల పువ్వులు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమతో అర్చకులు విశేష అలంకరణ చేశారు. తథానంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
News February 28, 2025
మెదక్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రులు 11.39శాతం, టీచర్ల ఓటింగ్ 8.36 శాతం పెరిగింది.
News February 28, 2025
ఏడుపాయలలో బోనంతో జోగు శ్యామల సందడి

ఏడుపాయల మహా జాతరలో భాగంగా గురువారం రాత్రి జోగు శ్యామల బోనంతో సందడి చేశారు. శ్యామల నెత్తిపై బోనం, చేతిలో త్రిశూలం చర్నాకోలతో ముందుకు సాగుతుండగా యువకులు, మహిళలు, భక్తులు కేరింతలతో హోరెత్తించారు. అనంతరం శ్యామల బోనం వన దుర్గామాత అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఆవిష్కృతమైంది. జాతరలో ఎడ్ల బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.