News February 28, 2025

అమిత్ షా మీటింగ్: బంగ్లాదేశీయులు, రోహింగ్యాల ఏరివేతే అజెండా!

image

HM అమిత్ షా అధ్యక్షతన నేడు ఢిల్లీలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. CM రేఖాగుప్తా, MoH అధికారులు హాజరవుతారు. శాంతి భద్రతలు, అక్రమ వలసదారుల ఏరివేతే అజెండా అని తెలిసింది. ఢిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో బంగ్లా దేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని దేశం నుంచి తరిమేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తారని సమాచారం. ఇప్పటికే పార్లమెంటులో ఇమ్మిగ్రేషన్ బిల్లును ఆమోదించడం గమనార్హం.

Similar News

News January 16, 2026

Money Tip: మీకు మీరే శిక్ష వేసుకోండి.. వినూత్న పొదుపు మంత్రం!

image

మీకున్న చెడు అలవాట్లపై మీరే పన్ను వేసుకోండి. డబ్బు ఆదా చేయడానికి ఇదొక వినూత్న మార్గం. అనవసర ఖర్చు చేసినప్పుడు అంతే మొత్తాన్ని పెనాల్టీగా మీ సేవింగ్స్‌ అకౌంట్‌లోకి డిపాజిట్ చేయండి. Ex ఒక బర్గర్ కొంటే దానికి సమానమైన డబ్బును వెంటనే అకౌంట్‌కు మళ్లించాలి. ఇలా చేస్తూ వెళ్తే పోగైన డబ్బును బట్టి మీకున్న బ్యాడ్ హాబిట్స్ వల్ల ఎంత నష్టమో తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ అలవడుతుంది. పొదుపు అలవాటవుతుంది.

News January 16, 2026

అధిక పోషకాల పంట ‘ఎర్ర బెండ’

image

సాధారణంగా దేశీయ బెండ(లావుగా, పొట్టిగా), హైబ్రిడ్ బెండ రకాలు ఆకుపచ్చగా (లేదా) లేత ఆకుపచ్చగా ఉండటం గమనిస్తాం. కానీ ఎర్ర బెండకాయలను కూడా సాగు చేస్తారని తెలుసా. ‘ఆంతో సయనిన్’ అనే వర్ణ పదార్థం వల్ల ఈ బెండ కాయలు, కాండం, ఆకు తొడిమెలు, ఆకు ఈనెలు ఎర్రగా ఉంటాయి. ఆకుపచ్చ బెండ కంటే వీటిలో పోషకాల మోతాదు ఎక్కువ. ఎర్ర బెండలో ‘కాశి లాలిమ’, ‘పూసా రెడ్ బెండి-1’ రకాలు అధిక దిగుబడినిస్తాయి.

News January 16, 2026

PCOSకి చెక్ పెట్టే చియా సీడ్స్

image

ప్రస్తుతకాలంలో చాలామందిని బాధించే సమస్య PCOS. దీనివల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడంలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే PCOSకి చియాసీడ్స్ పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.