News February 28, 2025
3 నెలల్లో 17వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు: పయ్యావుల

AP: గత ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారయ్యాయని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆ రహదారుల పునరుద్ధరణ చేపట్టిందన్నారు. ‘మిషన్-గుంతలు లేని రహదారుల ఆంధ్ర’ కింద 3 నెలల్లోనే 17,605కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేసిందని చెప్పారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి వాటికి ఆనుకొని ఉన్న మండల కేంద్రాలకు 2 వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నట్లు వివరించారు.
Similar News
News February 28, 2025
వెటరన్ యాక్టర్ ఉత్తమ్ కన్నుమూత

ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ(66) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1977లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన 135 ఒడియా, 30 బెంగాలీ, పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఒడియా ఫిల్మ్ ఐకాన్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తమ్ మృతిపై సీఎం మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు.
News February 28, 2025
అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌కు సీఎం అభినందనలు

AP: అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా మెడికో అంబుల వైష్ణవిని నియమిస్తూ CRDA ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును ఆమె కలవగా అభినందనలు తెలిపారు. రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆమెకు సూచించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఆమె ఇప్పటివరకు రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.
News February 28, 2025
ఉగ్రవాదిని అనుకుని గన్‌తో కాల్చబోయారు: సునీల్ శెట్టి

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగిన కొన్ని రోజులకు తనకు USలో భయానక పరిస్థితి ఎదురైనట్లు సునీల్ శెట్టి వెల్లడించారు. ‘2001లో నేను కాంటే మూవీ షూటింగ్ తర్వాత LAలోని హోటల్‌కు వెళ్తుండగా నా లుక్‌ను చూసి టెర్రరిస్టు అని అనుమానించారు. కిందికి రాకపోతే కాల్చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సంకెళ్లు వేశారు. హోటల్ మేనేజర్ నేనెవరో చెప్పడంతో వదిలేశారు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.