News February 28, 2025
NEP వైపే యువత మెుగ్గు: తమిళనాడు గవర్నర్

హిందీపై వ్యతిరేకత పేరుతో ఇతర దక్షిణ భారత భాషల్లోనూ విద్యార్థులను చదువుకోనివ్వడం లేదని తమిళనాడు గవర్నర్ RN రవి అన్నారు. దీని వల్ల ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి యువత అధికంగా ఉద్యోగావకాశాలను కోల్పోతోందన్నారు. రాష్ట్రంలో మెజార్టీ యువత NEPని అమలు చేయాలని కోరుతోందని తెలిపారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ NEPతో పాటు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News February 28, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 300 నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును మార్చి 3 వరకు పొడిగించారు. ఇందులో జనరల్ డ్యూటీ 260(మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ అర్హత), డొమిస్టిక్ బ్రాంచ్ 40(టెన్త్ అర్హత) పోస్టులున్నాయి. వయసు 18-22 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు 21,700-69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/
News February 28, 2025
CT: ఆస్ట్రేలియా చెత్త రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా చెత్త రికార్డును నమోదు చేసింది. ఏకంగా 37 ఎక్స్‌ట్రాలు సమర్పించుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టుకిదే అత్యధికం. అంతకుముందు 2009లో విండీస్‌తో జరిగిన మ్యాచులో 36 అదనపు పరుగులు సమర్పించుకుంది. ఓవరాల్‌గా 2004లో కెన్యాతో మ్యాచులో భారత జట్టు 42 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చింది.
News February 28, 2025
వెటరన్ యాక్టర్ ఉత్తమ్ కన్నుమూత

ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ(66) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1977లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన 135 ఒడియా, 30 బెంగాలీ, పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఒడియా ఫిల్మ్ ఐకాన్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తమ్ మృతిపై సీఎం మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు.