News February 28, 2025

విశాఖలో చిట్టీల పేరుతో మోసం

image

విశాఖలో చిట్టీల పేరుతో మోసం చేసిన దంపతులు అరెస్ట్ అయ్యారు. మల్కాపురానికి చెందిన దంపతులు మోహన్ రావు, లక్ష్మి చిట్టీల పేరుతో తనను మోసం చేశారని పెద్ద గంట్యాడకు చెందిన లక్ష్మీ న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనే వీరి వ్యవహరంపై సీపీని బాధితులు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యూపోర్ట్ CI కామేశ్వరరావు వీరిద్దరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. మార్చి 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది.

Similar News

News February 28, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళు రద్దు

image

రైల్వే నాన్ -ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ – గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్‌ను (17239/40) మార్చి 1,2,3 తేదీలలో, విశాఖ -గుంటూరు ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701/02) మార్చ్ 2న, విశాఖ – లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్(12805/06)మార్చ్ 2న, తిరుగు ప్రయాణంలో మార్చి 3న రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకులు గమనించాలన్నారు.

News February 28, 2025

వీఈఆర్‌లో మౌలిక సదుపాయాలపై చర్చ

image

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర, పూర్వ తూర్పుగోదావరి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వర్చువల్ సమావేశంలో చర్చించారు. వీఎంఆర్డీఏ కార్యాలయం నుంచి ఈసమావేశంలో నీతి ఆయోగ్ పథక సంచాలకులు పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ కిషోర్, వీఎంఆర్డీఏ ఎంసీ విశ్వనాథన్ పాల్గొన్నారు.

News February 28, 2025

‘విశాఖను ప్రథమ స్థానంలో నిలపండి’

image

విశాఖలో 2024 స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రథమ స్థానంలో నిలపాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్ సోమనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జోన్ -3 ఆఫీసులో అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం నేరుగా ముఖాముఖిగా, స్వచ్ఛత యాప్, వెబ్సైట్ లింకు ద్వారా సేకరించడం జరుగుతుందన్నారు. విశాఖ నగర అభివృద్ధికి, నగరాన్ని దేశంలోనే ప్రథమ స్థానం లక్ష్యసాధనకు ప్రజలుకు అవగాహన కల్పించాలన్నారు.

error: Content is protected !!