News February 28, 2025
ములుగు: బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు?

ములుగు జిల్లాలో రైతులకు సకాలంలో వరి ధాన్యం బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 11,379 మంది రైతులు నుంచి వరి ధాన్యాన్ని సేకరించగా.. 4,885 మంది రైతులకు రూ.15.64 కోట్లు చెల్లించారు. మిగిలిన 6,494 మంది రైతులకు రూ.19.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. బోనస్ ఇంకెప్పుడు ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News February 28, 2025
వీఈఆర్‌లో మౌలిక సదుపాయాలపై చర్చ

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) పరిధిలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర, పూర్వ తూర్పుగోదావరి జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల కలెక్టర్లతో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వర్చువల్ సమావేశంలో చర్చించారు. వీఎంఆర్డీఏ కార్యాలయం నుంచి ఈసమావేశంలో నీతి ఆయోగ్ పథక సంచాలకులు పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ కిషోర్, వీఎంఆర్డీఏ ఎంసీ విశ్వనాథన్ పాల్గొన్నారు.
News February 28, 2025
కొత్తచెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కొత్తచెరువు మండలం అప్పాలోలపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కమ్మవారిపల్లికి చెందిన చక్రధర్ (24) ఈ ప్రమాదంలో మృతి చెందారు. కొత్తచెరువు నుంచి కమ్మవారిపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో చక్రధర్ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.
News February 28, 2025
CT: ఆస్ట్రేలియా చెత్త రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా చెత్త రికార్డును నమోదు చేసింది. ఏకంగా 37 ఎక్స్‌ట్రాలు సమర్పించుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టుకిదే అత్యధికం. అంతకుముందు 2009లో విండీస్‌తో జరిగిన మ్యాచులో 36 అదనపు పరుగులు సమర్పించుకుంది. ఓవరాల్‌గా 2004లో కెన్యాతో మ్యాచులో భారత జట్టు 42 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చింది.