News February 28, 2025

కామారెడ్డి ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

image

కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు శుక్రవారం లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి గుర్రాల విజయ్ కుమార్ (36), ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కి చెందిన సోడి బాలకృష్ణ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. విజయ్.. హిడ్మా నాయకత్వంలోని CPI Maoist PLGA 1st బెటాలియన్‌లో 2022లో పార్టీ మెంబర్‌గా చేరారు. సోడి బాలకృష్ణ 2018లో చర్ల ఏరియా కమిటీ మలేషియా మెంబర్‌గా అరుణ్ DVC ఆధ్వర్యంలో చేరారు.

Similar News

News February 28, 2026

భారత్‌పై వరుస సెంచరీలు.. ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా మిచెల్

image

ఈ ఏడాది జనవరి నెలకు గాను న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచెల్‌ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ప్రకటించింది. భారత్‌తో ODI సిరీస్‌లో మిచెల్ 2 సెంచరీలు, ఒక ఫిఫ్టీతో రాణించారు. మొత్తం 352 రన్స్ చేసి NZ 1-2 తేడాతో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్తారీ నిలిచారు. ఆమె జనవరిలో ఆడిన 6 మ్యాచుల్లో 229 రన్స్ చేశారు.

News February 28, 2026

గద్వాల్ రైల్వే పార్కింగ్‌లో అక్రమ వసూళ్లు..?

image

గద్వాల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజువారీ ఛార్జీల కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారని వాహనదారులు అంటున్నారు. 24 గంటల పార్కింగ్‌కు రూ.32 ఉండగా రూ.60 తీసుకుంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. గద్వాల్ రైల్వే పార్కింగ్‌లో మీకు ఇలా జరిగిందా.. కామెంట్ చేయండి..!

News February 28, 2026

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

image

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం <<19263875>>ఘటన<<>> నేపథ్యంలో బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విజయనగరం నుంచి కాకినాడకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. వేట్లపాలెం చేరుకొని ఘటనాస్థలాన్ని పరిశీలించనున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడనున్నారు. మరోవైపు హోంమంత్రి అనిత కూడా ఘటనాస్థలానికి బయల్దేరారు.