News February 28, 2025
ఎక్కువ పని గంటలు ప్రాణానికి ముప్పు!

కెరీర్‌లో మరింత రాణించాలంటే ఎక్కువ గంటలు పనిచేయాలి అనుకునే వారికి డా. సుధీర్ కుమార్ పలు సూచనలు చేశారు. ‘కెరీర్ గ్రోత్ కోసం రోజుకు 15 గంటలు పని చేయొచ్చా అని ఓ 25 ఏళ్ల ఉద్యోగి అడిగితే ఇలా చేస్తే మీరు రాణించలేరని చెప్పా. తెలివిగా, ఎక్కువ ఉత్పాదకతతో పనిచేయడం మంచిది. అతిగా పనిచేయడం వల్ల గుండెపోటు, పక్షవాతంతో పాటు అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంది. ఒత్తిడితో పాటు నిరాశకు గురవుతారు’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News February 28, 2025
ALERT.. రేపటి నుంచి జాగ్రత్త

AP: విజయవాడ కమిషనరేట్ పరిధిలో రేపటి నుంచి కొత్త వాహన రూల్స్ అమల్లోకి రానున్నాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారికి, వెనుక కూర్చొని పెట్టుకోని వారికి, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్‌కు ₹1000, ఇన్సూరెన్స్ లేకపోతే ₹2000(తొలిసారి), రెండోసారి ₹4000, లైసెన్స్ లేకుండా బండి నడిపితే ₹5000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వారికి ₹1500, ఫోన్ మాట్లాడుతూ బండి నడిపితే ₹1500 ఫైన్ వేస్తామని పోలీసులు హెచ్చరించారు.
News February 28, 2025
సెమీస్‌కు ఆస్ట్రేలియా

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 274 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో 109 పరుగులు చేయగా మ్యాచుకు వర్షంతో ఆటంకం కలిగింది. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ రాగా నాలుగు పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది.
News February 28, 2025
రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్

TG: రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ నేతల లక్ష్యమని CM రేవంత్ అన్నారు. అప్పటివరకు కార్యకర్తలు విశ్రమించవద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇన్ని చేస్తే కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేయగలమో ఆలోచించాలని కార్యకర్తలకు సూచించారు.