News February 28, 2025
మల్దకల్: అమ్మా, నాన్న లేక అనాథలయ్యారు!

మల్దకల్ మండలం చర్లగార్లపాడులో అనారోగ్యంతో తల్లి, ఆర్థిక ఇబ్బందులతో తండ్రి మృతి చెందగా ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కుమ్మరి వీరేశ్, భారతి కుండలు చేస్తూ జీవిస్తున్నారు. భారతి జనవరి 16న అనారోగ్యంతో మృతి చెందింది. భార్య లేని లోటు, ఆర్థిక ఇబ్బందులతో వీరేశ్ గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు అంటున్నారు.
Similar News
News March 1, 2025
నేను వైసీపీలోనే ఉంటాను: తోట త్రిమూర్తులు

AP: తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని YCP MLC తోట త్రిమూర్తులు ఖండించారు. ఇటీవల జనసేన నేత సామినేని ఉదయభాను, త్రిమూర్తులు ఓ ఆలయంలో కలుసుకోవడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు.
News March 1, 2025
ప.గో జిల్లా TODAY TOP HEADLINES

✷భీమవరంలో కన్నుల పండుగగా సోమేశ్వర స్వామి తెప్పోత్సవం ✷ పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్: కేంద్ర సహాయ మంత్రి వర్మ ✷ బడ్జెట్ నిరుత్సాహపరిచేలా ఉంది: టీచర్ ఎమ్మెల్సీ గోపి మూర్తి ✷ రాయకుదురులో అగ్ని ప్రమాదం ✷ నరసాపురంలో గోవా మద్యం కేసులో నలుగురు అరెస్ట్✷ ఇరిగేషన్‌కు అధిక నిధులు: మంత్రి నిమ్మల ✷ ఆచంటలో కుంకుమ భరిణీల కోసం బారులు తీరిన జనం
News March 1, 2025
MHBD: ప్రైవేట్ కళాశాలల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: PDSU

మహబూబాబాద్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బానోతు దేవేందర్ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వద్దకు ప్రైవేట్ కళాశాలల యజమాన్యం వెళ్లి విద్యార్థుల సమాచారం తీసుకొని వారి అనుమతి లేకుండా అడ్మిషన్లు చేసి ఫీజు కట్టాలని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.