News February 28, 2025
బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం: బొత్స

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సూపర్-6లోని ఒకట్రెండు పథకాలు తప్ప మిగిలిన వాటి ఊసే లేదని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ‘ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలకు అన్యాయమే. ఆత్మ స్తుతి పర నిందగానే బడ్జెట్ సాగింది. జగన్‌ను తిట్టడం.. చంద్రబాబు, లోకేశ్‌ను పొగడడం తప్ప ఏమీ లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News February 28, 2025
రోహిత్, షమీ సహా అందరూ ఫిట్: కేఎల్

ఫిట్‌నెస్ సమస్యలతో మార్చి 2న కివీస్‌తో మ్యాచ్‌కు <<15595049>>రోహిత్,<<>> షమీ దూరమవుతారన్న వార్తలపై కేఎల్ రాహుల్ స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారు. ఎవరూ మ్యాచ్ మిస్సయ్యే ఛాన్స్ లేదు. అందరూ జిమ్, ప్రాక్టీస్ చేస్తున్నారు. పైగా సెమీస్‌కు ముందు ఒక మ్యాచే ఉన్నందున జట్టులో మార్పులు ఉండకపోవచ్చు’ అని తెలిపారు. కాగా ఇవాళ రోహిత్ గంట పాటు మైదానంలో చెమటోడ్చారు.
News February 28, 2025
రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్ ఫస్టియర్, 3వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు మొదలుకానున్నాయి. 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటుచేశారు. అన్ని సెంటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్టూడెంట్స్ గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
News February 28, 2025
ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీ: రేవంత్

TG: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉపయోగపడే ఆరోగ్యపాలసీని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హెల్త్, బల్క్ డ్రగ్ విషయంలో హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని చెప్పారు. కొవిడ్ సమయంలో చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయని పేర్కొన్నారు.