News February 28, 2025
ఫేక్ జాబ్ నోటిఫికేషన్‌తో స్కామర్ల కొత్త మోసం..!

ఉద్యోగ వేటలో ఉన్న వారిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచుతున్నారు. లింక్డ్‌ఇన్‌లో ఫేక్ జాబ్ నోటిఫికేషన్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ‘జాబ్ అప్లై చేసిన వారికి స్కామర్లు కాల్ చేసి ‘Grass Call’ అనే వీడియో కాల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. దీనిద్వారా సదరు వ్యక్తి ఫోన్, కంప్యూటర్‌లోని డేటా, బ్యాంక్ వివరాలతో సహా ప్రైవసీ సమాచారాన్ని తస్కరిస్తున్నారు’ అని వారు తెలిపారు.
Similar News
News February 28, 2025
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభమవుతుందన్న వార్తలను నిర్మాత నాగవంశీ ఖండించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ఆ ప్రాజెక్టు ఈ ఏడాది సెకండాఫ్‌లోనే స్టార్ట్ అవుతుందని తెలిపారు. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 తర్వాత బన్నీ సినిమా ఏదీ ఇంకా మొదలవని విషయం తెలిసిందే.
News February 28, 2025
మూడు మ్యాచ్‌ల్లో వరుణుడిదే గెలుపు

ఛాంపియన్స్ ట్రోఫీలో 3 మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. ఈ నెల 25న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్, నిన్న పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దవగా, ఇవాళ మధ్యలో వర్షం కురవడంతో అఫ్గానిస్థాన్-ఆసీస్ మ్యాచ్ కూడా రద్దైపోయింది. దీంతో పాకిస్థాన్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల్లో వరుణుడే విజయం సాధించాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
News February 28, 2025
రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ప్రస్తుతం చాలా మంది ఒకేచోట 9-12 గంటలు కూర్చొని పనిచేయాల్సి వస్తోంది. అయితే, ఇలా ఎక్కువసేపు కూర్చోవడం ప్రమాదకరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో చిత్తవైకల్యం, స్ట్రోక్, ఆందోళన, నిరాశతో పాటు నిద్రలేమి సమస్యలొస్తాయని పేర్కొంది. ఇలాంటి జాబ్స్ చేసేవారు శారీరక వ్యాయామం చేయడం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని సూచించింది. ఈ అధ్యయనంలో 73,411 మంది పాల్గొన్నారు.