News February 28, 2025
జూరాల ప్రాజెక్టు వద్ద ఇదీ పరిస్థితి..!

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన రోడ్డుపై గ్రౌటింగ్ హోల్స్‌లు బోరుబావిని తలపిస్తున్నాయి. డ్యామ్ లీకేజీలను అరికట్టేందుకు సిమెంట్ గ్రౌటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హోల్స్ బోరు బావిని తలపించేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును చూసేందుకు ప్రయాణికులు, సందర్శకులు వస్తుంటారు. గద్వాల్-ఆత్మకూరుకు ఇదే ప్రధాన రహదారి. ఈ ప్రమాదాలు జగరక ముందే పీజేపీ అధికారులు మూతలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
Similar News
News November 10, 2025
NLG: ఇన్‌ఛార్జి పాలన ఇంకెన్నాళ్లు..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవదాయశాఖలో ఇన్‌ఛార్జిల పాలన కొనసాగుతోంది. చెరువుగట్టు, దర్వేశీపురం, కోట మైసమ్మ టెంపుల్ తదితర ఆలయాలకు రెగ్యులర్ ఈవోలు లేరు. దీంతో దేవాలయాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడి దేవుడి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆస్తుల పరిరక్షణ, ఇతర నిర్వహణ సైతం సరిగా లేదని చెబుతున్నారు. కొన్ని ఆలయాల్లో వసతులు సరిగా లేవంటున్నారు.
News November 10, 2025
ఆస్ట్రేలియాలో SM వాడకంపై ఆంక్షలు.. DEC నుంచి అమలు

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించనున్నట్లు ఆస్ట్రేలియా PM ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. వారి ఆన్‌లైన్ సేఫ్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్ బిల్-2024లోని ఈ కొత్త రూల్ డిసెంబర్ 10, 2025 నుంచి అమల్లోకి రానుంది. దీంతో టీనేజర్లు FB, ఇన్‌స్టా, టిక్‌టాక్, X, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్లు ఓపెన్ చేయడం, నిర్వహించడం చట్ట విరుద్ధం.
News November 10, 2025
చలి పులి దెబ్బ: ఇంటింటా దగ్గు, జలుబు శబ్దాలే!

ఒక్కసారిగా వాతావరణం మారడంతో ఇంట్లో ఒక్కరైనా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఈ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈక్రమంలో పిల్లలు, పెద్దలు స్వెటర్లు & వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం. చల్లటి ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండండి. వేడి నీటితో ఆవిరి పట్టండి. సమస్య తీవ్రంగా ఉంటే స్వీయ వైద్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


