News February 28, 2025
ఈశా ఫౌండేషన్ పై చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

ఈశా ఫౌండేషన్ కేసులో హైకోర్టు తీర్పు సరైనదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఫౌండేషన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తమిళనాడు వెల్లియంగిరిలోని ఫౌండేషన్‌కు పర్యావరణ అనుమతులు లేవని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీచేసింది. దీంతో ఈశా ఫౌండేషన్ హైకోర్టును సంప్రదించింది. నిర్మాణం సక్రమంగానే జరిగిందని హైకోర్టు నోటీసులను కొట్టివేయడంతో బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Similar News
News March 1, 2025
నేటి ముఖ్యాంశాలు

* రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
* మళ్లీ MLAలుగా గెలవాలంటే పనితీరు మారాలి: చంద్రబాబు
* బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం: బొత్స
* రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్
* ప్రతి నియోజకవర్గంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్: శ్రీధర్‌బాబు
* టన్నెల్లో గల్లంతైన వారికోసం గాలింపు కొనసాగుతోంది: కలెక్టర్
* CT: సెమీస్ చేరిన ఆస్ట్రేలియా
News March 1, 2025
గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ శర్మ

తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ప్రాక్టీస్‌లో ఎలాంటి తడబాటు లేకుండా ఏకంగా 95 మీటర్లకు పైగా సిక్సర్ బాదినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎల్లుండి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఆడరనే ప్రచారానికి తెరదించినట్లే కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచుకు రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News March 1, 2025
నేను వైసీపీలోనే ఉంటాను: తోట త్రిమూర్తులు

AP: తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని YCP MLC తోట త్రిమూర్తులు ఖండించారు. ఇటీవల జనసేన నేత సామినేని ఉదయభాను, త్రిమూర్తులు ఓ ఆలయంలో కలుసుకోవడంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు.