News February 28, 2025
వీటిల్లో తక్కువ ధరకే విమాన ప్రయాణం!

విమానంలో ప్రయాణించడం ఖర్చుతో కూడుకున్నదని చాలా మంది భావిస్తుంటారు. అయితే, విమానయాన సంస్థలను బట్టి టికెట్ ధరలుంటాయి. ప్రపంచంలో అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం అందిస్తోన్న సంస్థగా Air Asiaకి పేరుంది. దీని తర్వాత వోలోటియా, ఫ్లైనాస్, ట్రాన్సావియా ఫ్రాన్స్‌తో పాటు ఐదో స్థానంలో ఇండియాకు చెందిన ఇండిగో ఉంది. ఇక కాస్ట్లీయెస్ట్ ఎయిర్‌లైన్స్ జాబితాలో ఖతర్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్ ఉన్నాయి.
Similar News
News October 17, 2025
లిక్కర్ షాపులకు నో ఇంట్రెస్ట్!

TG: లిక్కర్ షాపుల దరఖాస్తులకు అనుకున్నంత స్పందన రావట్లేదు. గతంతో పోలిస్తే నిన్నటి వరకు 55% తక్కువ దరఖాస్తులు రావడంతో అప్లికేషన్లు సమర్పించాలని అబ్కారీ శాఖ వ్యాపారులకు SMSలు పంపుతోంది. ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. అలాగే గత మూడేళ్లతో పోల్చితే 2024లో అమ్మకాలు, లాభాలు తగ్గాయని కూడా భావిస్తున్నట్లు సమాచారం.
*దరఖాస్తులకు రేపే చివరి తేదీ.
News October 17, 2025
మెడ దగ్గర నల్లగా ఉందా? ఈ టిప్స్ ట్రై చేయండి

హార్మోన్ల మార్పులు, ఆరోగ్య సమస్యల వల్ల మెడ నల్లగా మారుతుంది. దీన్ని తొలగించడానికి కొన్ని చిట్కాలున్నాయి. * పెరుగు, నిమ్మరసం కలిపి మెడకు రాసి 15ని. తర్వాత కడిగేయాలి. * పసుపు, పాలు కలిపి మెడకి అప్లై చేసి 20ని. తర్వాత కడిగేయాలి. * అలోవెరాజెల్, కాఫీ పొడి, పసుపు కలిపి మెడకి రాసి ఆరాక స్క్రబ్ చేస్తే స్కిన్ మెరుస్తుంది.
* మరిన్ని స్కిన్, హెయిర్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 17, 2025
వైట్ హెడ్స్ రాకుండా ఉండాలంటే?

ముక్కుపై చర్మరంధ్రాలు పెద్దగా ఉండటంతో నూనెలు, మృతకణాలు చేరి వైట్‌హెడ్స్ ఏర్పడతాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి వీటికి కారణమంటున్నారు నిపుణులు. వీటిని తొలగించడానికి మినరల్ కాస్మెటిక్స్, టోనర్, మైల్డ్ క్లెన్సర్ వాడాలి. వారానికి 3సార్లు తలస్నానం చేయాలి. ఫోన్, పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. మేకప్ ప్రొడక్ట్స్ ఎవరితోనూ పంచుకోకూడదు. అయినా తగ్గకపోతే వైద్యుల సలహాతో యాంటీ బయాటిక్స్ వాడాలి.