News February 28, 2025
బ్యారక్ మార్చాలని వంశీ పిటిషన్

AP: తన బ్యారక్ మార్చాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టును కోరారు. ఈమేరకు ఆయన తరఫు లాయర్లు పిటిషన్ వేశారు. బ్యారక్‌ను మార్చడం కుదరకపోతే, కొందరు ఖైదీలను తన గదిలో ఉంచాలని విన్నవించారు. తనకు 6-4 సైజ్ బ్యారక్ ఇచ్చారని, అందులో మంచం కూడా పట్టడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా తనకు ఆస్తమా ఉందని, సెల్లో తనకు తోడుగా మరొకరని ఉంచాలని నిన్న జడ్జిని వంశీ కోరిన సంగతి తెలిసిందే.
Similar News
News January 9, 2026
కుబేర యోగాన్ని పొందడం ఎలా?

జాతకంలో ఈ యోగం లేకపోయినా కొన్ని పరిహారాలతో కుబేరుడి అనుగ్రహం పొందవచ్చు. రోజూ ఇంట్లో ఉత్తర దిశలో ‘కుబేర యంత్రం’ ఉంచి పూజిస్తే ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి. కుబేర ముద్రను ధ్యానంలో ఉపయోగించడం, లక్ష్మీ కుబేర మంత్రాన్ని 108 సార్లు పఠించడం శ్రేయస్కరం. ఆకుపచ్చ రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవడం, పేదలకు దానధర్మాలు చేయడం ద్వారా కుబేర శక్తిని ఆకర్షించవచ్చు. మనసులో దృఢ సంకల్పం, శ్రమ ఉంటే ఈ యోగం తప్పక ఫలిస్తుంది.
News January 9, 2026
సంక్రాంతికి ఫ్రీ టోల్ లేనట్లే!

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే ఈ హైవేపై ఉచిత టోల్‌కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం తెలియజేసినట్లు సమాచారం.
News January 9, 2026
విమానాల తయారీలోకి అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుంది. బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రీజనల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఏర్పాటు చేయనున్నారు. ఫిక్స్డ్ వింగ్ ప్యాసింజర్ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్ యూనిట్ కానుంది. ఈ నెలాఖరున జరిగే ఏవియేషన్ షోలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.


