News February 28, 2025

లిరిసిస్టుకు సారీ చెప్పిన స్టార్ హీరోయిన్

image

కంగనా రనౌత్, జావెద్ అక్తర్ వివాదం సమసింది. వీరిద్దరూ పరస్పరం వేసుకున్న పరువు నష్టం దావా కేసులను వెనక్కి తీసుకున్నారు. ‘ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారం ముగిసింది. నాకు కలిగించిన అసౌకర్యానికి ఆమె క్షమాపణ చెప్పారు’ అని అక్తర్ బాంద్రా కోర్టు వద్ద మీడియాకు తెలిపారు. 2016లో Email అంశంపై హృతిక్ రోషన్‌తో కంగనా బహిరంగంగా గొడవపడ్డారు. దీనిపై రోషన్ కుటుంబానికి సారీ చెప్పాలని అక్తర్ కోరడంతో ఈ వివాదం మొదలైంది.

Similar News

News January 26, 2026

RD వేడుకలు.. PM మోదీ షేర్ చేసిన అద్భుత చిత్రాలు

image

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. భారత రక్షణ దళాలు చేసిన విన్యాసాలు, కళాకారులు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైనికుల మార్చ్ ఫాస్ట్, గుర్రాలు, ఒంటెలతో తీసిన ర్యాలీలు, వివిధ రాష్ట్రాల శకటాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా తీసిన చిత్రాలను ప్రధాని మోదీ ‘X’ వేదికగా పంచుకున్నారు.

News January 26, 2026

అంబేడ్కర్ యూనివర్సిటీలో 53పోస్టులకు నోటిఫికేషన్

image

ఆగ్రాలోని <>డాక్టర్ <<>>భీమ్‌రామ్ అంబేడ్కర్ యూనివర్సిటీ 53 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 25వరకు పంపాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, M.Phil, PhD, NET, SET ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. స్క్రీనింగ్ (అకడమిక్ స్కోర్, రాత పరీక్ష), టీచింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: dbrau.ac.in

News January 26, 2026

రేపు మధ్వనవమి.. ఎందుకు జరుపుతారంటే?

image

ద్వైత సిద్ధాంతకర్త, వాయుదేవుని మూడో అవతారమైన మధ్వాచార్యులు భౌతిక దేహంతో బదరీ క్షేత్రానికి పయనమైన పవిత్ర దినమే మధ్వనవమి. మాఘ శుక్ల నవమి నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో శిష్యులకు పాఠం చెబుతుండగా పుష్పవృష్టి కురిసి అదృశ్యమయ్యారు. హరియే సర్వోత్తముడని చాటిచెప్పిన ఆయన స్మరణార్థం నేడు మధ్వనవమి జరుపుకొంటాం. లోకానికి జ్ఞాన, భక్తి మార్గాలను అందించిన మహనీయుని పట్ల కృతజ్ఞతగా ఆయనకు విశేష పూజలు నిర్వహిస్తారు.