News February 28, 2025
KMR: ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి: కలెక్టర్

ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలని, పనులు మంజూరై ప్రారంభించని వాటిని కన్వర్ట్ చేస్తూ సీసీ రోడ్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం అధికారులతో కలిసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, సమగ్ర కుటుంబ సర్వే, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., త్రాగునీటి సౌకర్యాలు, ఇందిరమ్మ ఇళ్లు అంశాలపై ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, ఎంపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News November 8, 2025
21న సిరిసిల్ల-గోవా స్పెషల్ టూర్

ఆర్టీసీ సిరిసిల్ల డిపో నుంచి ఈనెల 21వ తేదీ శుక్రవారం గోవాకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ నిర్వహించనున్నారు. బీదర్, హుమ్నాబాద్, గానుగపూర్, మురుడేశ్వర్, గోకర్ణ, గోవా, పండరీపూర్, తుల్జాపూర్ సందర్శన అనంతరం తిరిగి 24న సిరిసిల్ల చేరుకుంటుంది. పెద్దలకు రూ.3900/-, పిల్లలకు 2750/- చార్జి ఉంటుందని, వసతి భోజన ఖర్చులు ప్రయాణికులు భరించాల్సి ఉంటుందని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు.
News November 8, 2025
రబీ శనగ సాగుకు అనువైన రకాలు

రబీలో నవంబర్ 15 లోపు వరకు శనగ పంటను విత్తుకోవచ్చు.
☛ రబీకి అనువైన దేశీ శనగ రకాలు నంద్యాల శనగ-1, జెబి-11, జెఎకెఐ-9218, జెబి-130, ధీర, నంద్యాల గ్రామ్-49, నంద్యాల గ్రామ్- 452, నంద్యాలగ్రామ్-776(N.B.E.G)-776.
☛ కాబులి రకాలు: కెఎకె-2, పూలెజి-95311, లాం శనగ-7 (ఎల్‌బిఇజి-7), నంద్యాల గ్రామ్-119(N.B.E.G-119), నంద్యాల గ్రామ్-810 (N.B.E.G-810)
News November 8, 2025
MBNR: ఈనెల 10, 11న ఖో-ఖో ఎంపికలు

మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాల, బాలికల ఖో-ఖో జట్ల ఎంపికలను డీఎస్ఏ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి తెలిపారు. ఈ నెల 10న అండర్-14, 11న అండర్-17 ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ జిరాక్స్‌లతో ఉదయం 9 గంటలలోపు పీడీ మొగులాల్ (99859 05158)ను సంప్రదించాలని సూచించారు.


