News February 28, 2025
బడ్జెట్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: బుగ్గన

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను మసిపూసి మారేడుకాయ చేసిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వం 9నెలల్లోనే రూ.1.30లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ఈ లెక్కలు బడ్జెట్‌లో లేవని అన్నారు. బడ్జెట్ బుక్‌లో కలర్ ఎక్కువ కంటెంట్ తక్కువంటూ ఆయన సెటైర్లు వేశారు. బడ్జెట్ ప్రసంగంలో 35 సార్లు గత ప్రభుత్వం అని చెప్పారని, ఇంకెన్ని రోజులు తమ జపం చేస్తారని మండిపడ్డారు.
Similar News
News July 7, 2025
ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హోషియార్‌పూర్‌లోని హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడి 8 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు.
News July 7, 2025
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 11 వరకు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News July 7, 2025
బల్దియా సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు

అట్టహాసంగా ప్రారంభమైన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని కొద్దీ సేపటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించి బయటకు వచ్చారు. భద్రకాళి చెరువు విషయంలో చర్చ లేవనెత్తడంపై మేయర్ సుధారాణి అనుమతించకపోవడంతో కార్పొరేటర్లు అసహనానికి గురయ్యారు. దీంతో సమావేశాన్ని బహిష్కరించి బయటికు వచ్చి నిరసన చేపట్టారు.