News February 28, 2025
మెరుగుపడిన Q3 GDP.. 6.2%గా నమోదు

FY2024-25 మూడో త్రైమాసికంలో భారత ఎకానమీ 6.2% వృద్ధిరేటు నమోదు చేసింది. రెండో త్రైమాసికంలోని 5.6%తో పోలిస్తే కొంత మెరుగైంది. గ్రామీణ ఆదాయం పెరగడం, ఖరీఫ్ దిగుబడులు మెరుగ్గా ఉండటం ఇందుకు దోహదపడింది. గత ఏడాది క్యూ3 వృద్ధిరేటైన 9.5%తో పోలిస్తే మాత్రం బాగా తక్కువే. తయారీ, మైనింగ్ రంగాల ప్రదర్శన మెరుగ్గా లేకపోవడమే ఇందుకు కారణం. మొత్తంగా ఈ ఆర్థిక ఏడాదిలో GDP 6.5%గా ఉంటుందని NSO అంచనా వేసింది.
Similar News
News March 1, 2025
WPL: టేబుల్ టాప్‌లో ఢిల్లీ

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ లానింగ్(60*) అర్ధసెంచరీ చేయగా షఫాలీ 28 బంతుల్లో 43 రన్స్ చేశారు. 10వ ఓవర్లో షఫాలీ ఔటైనా రోడ్రిగ్స్‌తో కలిసి కెప్టెన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 8 పాయింట్లతో ఢిల్లీ తొలి స్థానానికి చేరింది.
News March 1, 2025
ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.
News March 1, 2025
చరిత్రలో ఈరోజు.. మార్చి 1

* 1901- ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభాపతి నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1968- భారత మాజీ వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవి జన్మదినం
* 1969- ఇండియన్ రైల్వేస్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెట్టారు. తొలి రైలు ఢిల్లీ, కోల్‌కతా మధ్య నడిచింది
* 1986- తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు