News February 28, 2025

కొండగట్టులో పలు వ్యాపారాలకు టెండర్

image

జిల్లాలోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవాళ పలు వ్యాపారాలకు అధికారులు ఈ, సిల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు అమ్ముకునే హక్కుకు రూ. 1,50,00,000, పుట్నాలు, పేలాలు అమ్ముకునే హక్కుకు రూ. 27,70,000, పూలు, పండ్లు అమ్ముకునే హక్కుకు రూ.40,00,000, గాజులు ప్లాస్టిక్ ఆట వస్తువులు అమ్ముకునే హక్కు రూ.32,00,000 లతో హెచ్చు పాటాదారులు దక్కించుకున్నారు.

Similar News

News March 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 1, 2025

జెలెన్‌స్కీ ఉక్కిరిబిక్కిరి.. ట్రంప్ రాకతో అంతా తారుమారు

image

రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు US అండగా నిలిచింది. బైడెన్ ప్రభుత్వం ఆ దేశానికి నిధులు, యుద్ధ సామగ్రిని సమకూర్చడంతో రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా బదులిచ్చింది. కానీ ఇటీవల US ఎలక్షన్స్‌లో బైడెన్ ఓటమితో అంతా తారుమారైంది. అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు నిధులను ఆపేశారు. అసలు యుద్ధమంతా జెలెన్‌స్కీ వల్లే వస్తోందని మండిపడ్డారు. ఈక్రమంలోనే US పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీని మీడియా ముందే తిట్టిపోశారు.

News March 1, 2025

ములుగు: ‘ఆయనకు MLC టికెట్ ఇవ్వాలి’ 

image

బీసీ కోటాలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు అశోక్‌కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని తాడ్వాయిలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సతీశ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి కోరారు. సామాజిక కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి అశోక్ అని, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి నిత్యావసర వస్తువులు అందించారని, బీసీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

error: Content is protected !!