News February 28, 2025
రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి: హోం మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో హోంశాఖకు రూ.8,570 కోట్లు కేటాయించడం ఇదే తొలిసారి అని హోమ్ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ‘ఎక్స్’ వేదిగా హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖకు రూ.920 కోట్ల పెండింగ్ బకాయిల్లో ఇప్పటికే రూ.250 కోట్లు చెల్లించామన్నారు.
Similar News
News March 1, 2025
రూల్స్ అతిక్రమిస్తే జరిమానా: సీపీ రాజశేఖరబాబు

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,000 జరిమానా, 3 నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 డి ప్రకారం ఈ మేరకు రూ.1,000 జరిమానా విధిస్తామని, బైక్‌లు నడిపేవారు హెల్మెట్ ధరించి సురక్షితంగా తమ గమ్యస్థానాన్ని చేరుకోవాలని సూచించారు.
News March 1, 2025
సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త: ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతాం అంటూ కాల్ చేసే సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త అని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్ ద్వారా లేదా SMS వస్తున్నట్లయితే, అది సైబర్ మోసగాళ్ళ పని అయ్యి ఉంటుందని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచే ఆఫర్‌తో సైబర్ మోసగాళ్ళు బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి మిమ్మలను నమ్మించి మోసం చేస్తారని అన్నారు.
News March 1, 2025
WPL: టేబుల్ టాప్‌లో ఢిల్లీ

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ లానింగ్(60*) అర్ధసెంచరీ చేయగా షఫాలీ 28 బంతుల్లో 43 రన్స్ చేశారు. 10వ ఓవర్లో షఫాలీ ఔటైనా రోడ్రిగ్స్‌తో కలిసి కెప్టెన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 8 పాయింట్లతో ఢిల్లీ తొలి స్థానానికి చేరింది.