News February 28, 2025

ముమ్మిడివరం: రోడ్డు ప్రమాదం.. యువకుల వివరాలు ఇవే..

image

ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ముమ్మిడివరం మండలం బూరుగుపేటకు చెందిన మట్ట ఆకాశ్‌రెడ్డి (21), ముమ్మిడివరానికి చెందిన అభి(19) అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం రాత్రి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి యానం వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న లారీని కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 9, 2025

NLG: ఇక్కడి నాయకులంతా అక్కడే..!

image

ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైనే చర్చ జరుగుతోంది. సిటీకి దగ్గరగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులంతా HYDలోనే మకాం వేశారు. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, BRS, BJP ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇక్కడి నాయకులంతా అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు. పోటాపోటీగా కొనసాగుతున్న ప్రచార పర్వంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.

News November 9, 2025

పత్తి కొనుగోళ్లపై ఆ నిబంధన ఎత్తేయండి: తుమ్మల

image

ఖమ్మం: పత్తి కొనుగోళ్లలో ఉన్న నిబంధనలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ సీఎండీ లలిత్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎకరాకు 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని తక్షణమే ఎత్తివేసి, పాత విధానంలో కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 20 శాతం తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News November 9, 2025

రాజన్నకు దండాలు.. భీమన్నకు మొక్కులు..!

image

వేములవాడలో భక్తులు కొత్త రకమైన వాతావరణం ఎదుర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో కోడె మొక్కులు సహా అన్ని రకాల ఆర్జిత సేవలను భీమన్న ఆలయంలోకి మార్చిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. అనంతరం మొక్కుల చెల్లింపు కోసం శ్రీ భీమేశ్వరాలయం సందర్శించి అభిషేకం, అన్నపూజ, కోడెమొక్కు చెల్లిస్తున్నారు.