News February 28, 2025
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. శుక్రవారం కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీని కలెక్టర్ పరిశీలించి మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ లక్ష్మారెడ్డి, సిబ్బంది ఉన్నారు.
Similar News
News March 1, 2025
సిరిసిల్ల: ఇంటర్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మార్చి 5, నుంచి మార్చి 25వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉ. 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 5065 మంది, రెండవ సంవత్సరంలో 4245 మొత్తం 9310 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఇందుకు గాను 16 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News March 1, 2025
అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు: ట్రంప్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గొడవపై ట్రంప్ స్పందించారు. ఆయన వైట్‌హౌస్ బయట మీడియాతో మాట్లాడారు. ‘అమెరికాను జెలెన్‌స్కీ అవమానించారు. ఎప్పుడైతే ఆయన శాంతి స్థాపనకు సిద్ధపడతారో అప్పుడే మళ్లీ ఇక్కడికి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా అంతకుముందు ట్రంప్‌తో జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగడాన్ని US ఉపాధ్యక్షుడు వాన్స్ తప్పుబట్టారు. మీడియా ముందు తమ అధ్యక్షుడిని అగౌరవపరిచారని మండిపడ్డారు.
News March 1, 2025
మాకు శాశ్వత శాంతి కావాలి: జెలెన్‌స్కీ

వైట్‌హౌస్‌లో US అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదం అనంతరం భేటీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ‘థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్రెసిడెంట్. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. మేం అందుకోసమే పనిచేస్తున్నాం’ అని రాసుకొచ్చారు. కాగా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకోవడం లేదని, జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవడం లేదని అంతకుముందు ట్రంప్ ఆరోపించారు.